హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టాక్ మార్కెట్ ప్రకటనలను నమ్మొద్దు: సీపీ

RR: రాయదుర్గంలో సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా పోస్టర్‌ను సైబరాబాద్ సీపీ ఎం. రమేశ్ ఆవిష్కరించారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌తో అధిక లాభాలంటూ వచ్చే ప్రకటనలను నమ్మొద్దని సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టులు ఉండవని, బెదిరింపులకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.