హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాయర్‌పై దాడి.. PS ఎదుట ధర్నా!

KRNL: ఆదోనిలో బుధవారం లాయర్, క్లయింట్ మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో లాయర్ వైఎం మల్లికార్జునపై క్లయింట్ తరఫున వచ్చిన 10మంది మూకుమ్మడిగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.