హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సబ్బవరానికి గోదావరి జలాలతో శుద్ధ తాగునీరు'

AKP: సబ్బవరం మండలానికి త్వరలో గోదావరి నది నుంచి శుద్ధ తాగునీటిని తీసుకొచ్చి ఇంటింటికీ కొళాయిల ద్వారా అందిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు నిన్న తెలిపారు. జలజీవన్‌ మిషన్‌ కింద పెందుర్తి నియోజకవర్గానికి రూ.178.57 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల తరలింపుతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.