హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'48 వార్డులుగా విభజించి ఎన్నికల నిర్వహిస్తాం'

PLD: నరసరావుపేట మున్సిపాలిటీని 48 వార్డులుగా విభజించి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జనాభా, జనవరి నాటి ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డుల పునర్విభజన జరుగుతోంది. రెండో దశలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కమిషనర్‌ పి. రమ్యకీర్తన తెలిపారు. ఈ నెల 11లోగా పూర్తి వివరాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు చెప్పారు.