ASR: కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీలో బుధవారం ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. రహదారులను శుభ్రపరచడంతోపాటు పారిశుధ్యం, స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి జీ.అప్పారావు, పెసా ఉపాధ్యక్షులు సెగ్గే శ్రీను, పల్లి అప్పారావు, మాదల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నల్లగొండలో స్వచ్ఛత కార్యక్రమం


