హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.60 కోట్లు

NTR: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ హుండీలను 14 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ. 2,60,73,491 నగదుతో పాటు, 186 గ్రాముల బంగారం, 2.605 కిలోల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. నోట్ల రూపంలో రూ. 2,49,93,491, నాణేల రూపంలో రూ.10,80,000 సమకూరగా, రోజువారీగా సగటున రూ.18,62,392.21 ఆదాయం నమోదైనట్లు పేర్కొన్నారు.