హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

AKP: చోడవరం మండలం గోవాడ మసీదు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాకల రాజారావు(53) మృతి చెందారు. గత శనివారం బైక్‌పై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ.. బుధవారం మృతి చెందారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.