హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మర్రివాడలో ఆపరేషన్ త్రిశూల్ అవగాహన

ASR: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా బుధవారం కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కిషోర్‌వర్మ ఆధ్వర్యంలో మర్రివాడలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత, మహిళలు-బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. OTP,బ్యాంకు వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు.