HYD: చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రివేళ ముఖం కప్పుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ షాజాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పోలీస్ చట్టం సెక్షన్ 61(బి) కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారించిన నాంపల్లి ఆరో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ టి. శ్రీనివాస్ నిందితుడికి 5 రోజుల జైలు శిక్ష విధించారు.
తెలంగాణ
అనుమానాస్పద వ్యక్తికి జైలు శిక్ష..!


