VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిందన్న వార్తలపై వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ స్పందించారు. ప్రాజెక్టుల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి, బాలురు–బాలికల హాస్టళ్ల సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసినందునే అంచనా వ్యయం పెరిగిందని తెలిపారు. అలాగే 2026–27 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు అమల్లోకి రావడం కూడా వ్యయ పెరుగుదలకు కారణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విస్తీర్ణం పెరగడంతోనే వ్యయం పెరిగింది'


