హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ విస్తరణ : కలెక్టర్

KDP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ సేవలను విస్తరించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. త్వరలో లక్ష మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం 80శాతం పాఠశాలలకు వాహనాల ద్వారా భోజనం అందుతుండగా, మిగిలిన పాఠశాలలకు అందించేందుకు నిర్మాణ,టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.