హైదరాబాద్: 28°C
తెలంగాణ

1930 నంబరుకు ఫిర్యాదు చేయండి: ఎస్పీ

SRCL: అగ్రహారంలోని జేఎన్టీయూహెచ్ కళాశాలలో సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్పీ మహేశ్ బి.గితే మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దన్నారు. నకిలీ లింకులు, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు.