హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మద్యం దుకాణాలకు లాటరీ

శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో 27 మద్యం దుకాణాలకు ఇవాళ లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతినాయుడు తెలిపారు. లైసెన్స్ పునరుద్ధరణకు 39 మంది ముందుకు రాక కొత్త దరఖాస్తులు ఆహ్వానించారు. 7 మండలాల్లో 10 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు. నరసన్నపేట, సారవకోటలో 4 కంటే తక్కువ రావడంతో అవి ఖాళీగానే ఉన్నాయి.