హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: చల్లపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 33 కేవీ లైన్ పనుల కారణంగా నేడు చల్లపల్లి మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సప్లై నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించగలరని ఆయన కోరారు.