హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్రెలను తప్పించబోయి పత్తి లారీ బోల్తా

NGKL: చారకొండ మండలం జూపల్లి సమీపంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక నుంచి కలకతా కు పత్తి లోడుతో వెళ్తున్న లారీకి రోడ్డుపైకి గొర్రెలు అడ్డంగా రావడంతో వాటిని తప్పించబోయి అదుపుతప్పి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో పత్తి బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.