హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండలమ్మ తల్లి ఆలయంలో ముమ్మర ఏర్పాట్లు

కృష్ణా: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ తల్లి దేవాలయం సిద్ధమవుతోంది. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయశాఖ అధికారులు ఆలయ పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.