KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య చంద్రావతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


