హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ బాలికల హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ సమీపంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని పరిసరాలు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, వసతి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.