హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ శబరి

NDL: ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు ఎంపీ శబరి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.