హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.