హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓట్ల తొలగింపుపై సీఈసీని ప్రశ్నించిన శివసేన రెడ్డి

WNP: ఫామ్–6 పేరుతో బీజేపీకి ఓటు వేయని వారి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆరోపించారు. బుధవారం వనపర్తిలో అఖిలపక్షం నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌ను అడ్డం పెట్టుకుని ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఓట్లను తొలగించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.