హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంపాక్ట్ రూల్‌ తీసేయొచ్చేమో: భారత మాజీ క్రికెటర్

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలగిస్తేనే అసలైన ఆల్‌రౌండర్లు తయారవుతారని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్న నమన్ ధీర్‌ను ప్రశంసిస్తూ.. అతను భవిష్యత్తులో భారత్‌కు, ముంబై ఇండియన్స్‌కు ఎంతో ఉపయోగపడతాడని, ఐపీఎల్‌లోనూ అతనికి మరిన్ని వికెట్లు దక్కుతాయని శ్రీకాంత్ పేర్కొన్నాడు.