హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడని జోస్యం చెప్పాడు. అతడిలో ఇంకా పరుగులు చేయాలనే కసి తగ్గలేదన్నాడు. ఫిట్‌నెస్ పట్ల కోహ్లీ చూపే అంకితభావం అద్భుతమని, అతడి నుంచి మనం ఇంకా ఎంతో క్రికెట్ చూడొచ్చని అభిప్రాయపడ్డాడు.