హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్‌తో సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్!

న్యూజిలాండ్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వెన్ను గాయం బారిన పడ్డాడు. కివీస్‌తో పోరుకు సన్నాహకంగా ఇండియా-ఏ జట్టు తరఫున బరిలోకి దిగాల్సి ఉండగా ఈ గాయం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్న పంత్.. త్వరగా కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.