హైదరాబాద్: 28°C
తెలంగాణ

రబీ ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్

భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం రబీ కార్యాచరణ ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు పాల్గొని ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాబోయే రబీ సీజన్‌కు విత్తనాలు, ఎరువుల లభ్యత, సాగు విస్తరణపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ADAలు, AOలు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.