రాత్రిపూట భోజనం మానేస్తే బరువు తగ్గుతామని చాలా మంది డిన్నర్ స్కిప్ చేస్తారు. కానీ దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. రాత్రి పూట ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. శరీరం అలసటకు గురవుతుంది. మరుసటి రోజు ఉదయం అతిగా తినే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి భోజనం పూర్తిగా మానకుండా.. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
రాత్రి భోజనం మానేస్తున్నారా?


