హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవుల్లో అక్రమ మట్టి తవ్వకాలు, జేసీబీ సీజ్

BHPL: మహదేవ్‌పూర్ మండలం సూరారం బీట్ అటవీ ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసీబీని అటవీ శాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. అటవీ భూమి నుంచి మట్టి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టి వాహనాన్ని గుర్తించారు. జేసీబీని స్వాధీనం చేసుకుని మహదేవ్‌పూర్ డిపోకు తరలించి, అటవీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.