హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి'

WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. దీప మాట్లాడారు. ప్రజలు ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసుల్లో ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో రాజీ పడాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు వెల్లడించవద్దని కోరారు.