హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓగా వాసంతి

MHBD:  జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారిగా (డీఈఓ) వాసంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రెగ్యులర్ డీఈఓగా కొనసాగుతున్న ఆమెను మహబూబాబాద్ ఇన్‌చార్జ్ డీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో విద్యాశాఖ పరిపాలన, పాఠశాలల నిర్వహణ, విద్యా కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వహించనున్నారు.