HNK: హంటర్ రోడ్డులోని భద్రకాళి బండ్ సమీపంలో వర్షానికి మురుగు కాలువ నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో రోడ్డులో సగం వరకు నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదు. వర్షం పడిన ప్రతిసారీ సమస్య తలెత్తకుండా మురుగు కాలువల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వర్షంతో రోడ్డుపైకి చేరిన మురుగు నీరు


