WGL: కాశిబుగ్గలో శివ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గా అమ్మవారి ఆగమన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, జెండాలతో అమ్మవారికి భక్తులు ఘన స్వాగతం పలికారు. యువత ఉత్సాహంగా పాల్గొనగా.. చిన్నారులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంతో కాశిబుగ్గ ప్రాంతం సందడిగా మారింది.
తెలంగాణ
VIDEO: కాశిబుగ్గలో పండుగ సందడి


