హైదరాబాద్: 28°C
తెలంగాణ

వట్టివాగు కాలనీలో పోషణ మాసం కార్యక్రమం

ASF: వట్టివాగు కాలనీలోని దిశా మోడల్ పాఠశాల ఆవరణలో బుధవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలని ఎస్సీఆర్పీ రాథోడ్ రవీందర్ సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.