విశాఖపట్నం ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ జయరాం రాయ్‌పురా బుధవారం అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరం స్వామిని దర్శించుకున్న ఐటీ చీఫ్ కమిషనర్


