హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపి పొగాకు వేలంలో కిలో రూ.196.93

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసరి ధర కిలో రూ.196.93 పలికిందని వేలం కేంద్ర నిర్వహణ అధికారి ఎం. శంకర్రావు తెలిపారు. మూడో క్లస్టర్ పరిధిలోని రైతులు 589 బేళ్లను వేలానికి తీసుకురాగా, 478 బేళ్లు కొనుగోలు అయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 104 బేళ్లను తిరస్కరించినట్లు తెలిపారు.