ASR: ఎస్.ఆర్.శంకరన్ 16వ వర్ధంతిని బుధవారం పాడేరులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. శంకరన్ పేదలు, దళితులు, గిరిజనులు హక్కుల కోసం కృషి చేశారని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స తెలిపారు. ఆయనను “పీపుల్స్ ఐఏఎస్ ఆఫీసర్”గా ప్రజలు గుర్తించారన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు అధికారులు ప్రజలకు అండగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు ప్రజల పక్షాన ఉండాలి'


