NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ కళాశాల సమీపంలో అప్పుడే పుట్టిన శిశువును చెత్తబుట్టలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శిశువును కుక్కలు పీక్కుతినేందుకు యత్నించడాన్ని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఐ రాము కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెత్తబుట్టలో శిశువు మృతదేహం


