హైదరాబాద్: 28°C
తెలంగాణ

భువనగిరిలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

BHNG: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సీపీఐ, మహిళా సమాఖ్య, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఇవ్వాళ ముందస్తు వేడుకలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టారు. సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు.