హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోయినిపల్లికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం

SRCL: బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరు కావడంతో యువత ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు.