హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే బిక్కిన

కోనసీమ: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆలమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని వైఎస్ జగన్ సూచించినట్లు పేర్కొన్నారు.