ELR: యర్రమిల్లిపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ శుభ్రత - మన బాధ్యత అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ హాజరయ్యారు. గ్రామంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
యర్రమిల్లిపాడులో స్వచ్ఛపథం కార్యక్రమం


