హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈసీ దిష్టిబొమ్మ దహనం

SRPT: ఓటు చోరీ ఆరోపణలను నిరసిస్తూ కోదాడ రంగా థియేటర్ చౌరస్తాలో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు బుధవారం రాత్రి నిరసన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఆధ్వర్యం వహించారు.