హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై పోలీసుల ముందస్తు ప్రణాళిక

GNTR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని ఫిరంగిపురం సీఐ కే. భుజంగరావు సూచించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.