హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత, హస్తకళల ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్

HYD: అమీర్‌పేట్ కమ్మ సంఘం హాల్‌‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ - తెలంగాణ 2026 చేనేత, హస్తకళల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. హస్తకళలు ఒక ప్రాంతం యొక్క చరిత్రను, సంస్కృతిని, పూర్వీకుల నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయన్నారు. చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు మద్దతుగా నిలవాలన్నారు.