హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

JGL: సైబర్ జాగృకత దివస్‌లో భాగంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. “PAUSE • THINK • VERIFY” సందేశాన్ని పాటిస్తూ అనుమానాస్పద కాల్స్, సందేశాలు, లింకులపై తొందరగా స్పందించవద్దని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.