E.G: కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి జంక్షన్ సమీపంలోని హిందూస్థాన్ పెట్రోల్ బంక్ వద్ద అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. OD 10 Z 5328 మారుతీ ఎర్టిగా కారులో తరలిస్తున్న 10.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.1,600 నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్


