హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ప్రకాశం: ఈ నెల 9న సీఎం నారా చంద్రబాబు నాయుడు జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, సభా ప్రాంగణాలను అధికారులతో కలిసి పరిశీలించిన ఎస్పీ భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు.