MDK: శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ(62) కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు కొండయ్య కుంటలో పడి మృతి చెందాడు. విషయం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కుంటలో పడి వ్యక్తి మృతి


