JGL: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్ హెచ్చరించారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ బ్రిడ్జి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వాహనదారులకు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎస్సై సూచించారు.
వార్తలు
తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్సై


