కోనసీమ: వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక టెండర్లలో కొబ్బరి చెక్కల హక్కును శ్రీ పవన్ సూర్య ట్రేడర్స్ రూ. 2,03,49,999కు దక్కించుకుంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే దేవస్థానానికి రూ.40,16,666 అదనపు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నిత్య పూల అలంకరణ టెండర్‌ను పైడికొండల వీరబాబు దక్కించుకోగా, తులాభారం టెండర్ వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి దేవస్థానానికి రూ.2.03 కోట్ల టెండర్ ఆదాయం


