హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ ఢీకొని యువకుడు మృతి

NDL: గడివేముల మండలం బూజునూరు గ్రామ సమీపంలో బుధవారం లారీ ఢీకొనడంతో గౌతం (23) అనే యువకుడు మృతి చెందాడు. పొలానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గౌతంను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు.